వైభవంగా లక్ష దీపోత్సవం

ABN , First Publish Date - 2021-12-04T06:58:44+05:30 IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవోపేతంగా జరిగింది.

వైభవంగా లక్ష దీపోత్సవం
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కమలానంద భారతిస్వామి

ఔషధలింగేశ్వర స్వామికి అభిషేకం

కార్యక్రమాన్ని ప్రారంభించిన కమలానంద భారతిస్వామి

అశేషంగా పాల్గొన్న మహిళలు

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 3 : నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో శుక్రవారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవోపేతంగా జరిగింది. శ్రీ భువనేశ్వరిపీఠం గన్నవరం విజయవాడకు చెందిన కమలానంద భారతీ స్వా మి ప్రత్యేకపర్యవేక్షణలో ఔషధలింగేశ్వరస్వామికి 108 రకాల వస్తువులతో అభి షేకం నిర్వహించారు. జ్యోతిప్రజ్వలన ధ్వజారోహణ కార్యక్రమంతో పాటు గోపూజ జరిపారు. వేదికపై అభిషేకం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారా యణం చేశారు. నిర్మల్‌ గాయత్రి గోశాల నిర్వాహకులు దోమడాల ప్రవీణ్‌ కు మార్‌ నిర్వహణలో గోమయ ప్రతిమలతో లక్షదీపోత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. పంచామృతాభిషేకం, నిశిపూజ, భస్మహారతి నిర్వహించారు. దేశంలోనే మొదటిసారిగా ఔషఽధాలతో లింగానికి అభిషేకం నిర్వహించారు. కామారెడ్డికి చెందిన గంగవరం ఆంజనేయశర్మ, పవన్‌కుమార్‌శర్మలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌, వీహెచ్‌పీ నాయకులు మంచిర్యాల నాగభూషణం తదిత రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నృత్యప్రదర్శన అల రించాయి. 

Updated Date - 2021-12-04T06:58:44+05:30 IST