లక్షలాది రూపాయల మేర సీసీ అక్రమాలు?

ABN , First Publish Date - 2021-02-28T07:10:11+05:30 IST

పేదరిక నిర్మూలన పఽథకంలో వెలుగు సిబ్బంది చేతివాటంతో లక్షలాది రూపాయలు దారిమళ్లాయి. మారేడుమిల్లి మండలం డీవీ కోట క్లష్టర్‌లో సీసీగా పనిచేస్తున్న ఒకరు గిరిజనులకు అందవలసిన రూ.1.70 కోట్లలో 50 శాతం నిధులను నొక్కేసినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్యకు ఫిర్యాదులు అందడంతో ఆయన విచారణకు ఆదేశించారు.

లక్షలాది రూపాయల మేర సీసీ అక్రమాలు?
నరసాపురం గ్రామంలో శనివారం విచారణ చేస్తున్న అధికారులు

మారేడుమిల్లి, ఫిబ్రవరి 27: పేదరిక నిర్మూలన పఽథకంలో వెలుగు సిబ్బంది  చేతివాటంతో లక్షలాది రూపాయలు దారిమళ్లాయి. మారేడుమిల్లి మండలం డీవీ కోట క్లష్టర్‌లో సీసీగా పనిచేస్తున్న ఒకరు గిరిజనులకు అందవలసిన రూ.1.70 కోట్లలో 50 శాతం నిధులను నొక్కేసినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్యకు ఫిర్యాదులు అందడంతో ఆయన విచారణకు ఆదేశించారు. మం డల తహశీల్దారు, వెలుగు ఏపీడీ, ఎస్‌ఐలను బృందంగా ఏర్పడి వెలుగు అక్రమాలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీంతో క్లష్టర్‌ పరిధిలోని నరసాపురం, డీవీ కోట, శ్రీపురం, గొరమామిడి, కేవీ లంక, తాడేపల్లి గ్రామాల్లో విచారణను అధికారులు ప్రారంభించారు. సీసీడీసీ, స్త్రీనిధి, టీఎస్పీ, సీఐఎఫ్‌, వీవోఆర్‌ఎఫ్‌ పఽథకాల్లో గిరిజనులకు అందవలసిన సొమ్ములను మహిళా ఉద్యోగిని ఒకరు స్వాహా చేశారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని సదరు ఉద్యోగిని వీవో లీడర్స్‌తో ఖాళీ చెక్కులపై సంతకాలను తీసుకుని సొమ్ములను తన కుటుంబ సభ్యులు, రంపచోడవరంలోని కొన్ని వ్యాపార సంస్థల ఖాతాల్లోకి దారిమళ్లించినట్టు అధి కారుల విచారణలో తేలింది. దీనిపై సోమవారం నాటికి విచారణ పూర్తి చేసి నివేదికను ఐటీడీఏ పీవోకు అందజేయనున్నట్టు వెలుగు ఏపీడీ చిన్న శ్రీనివాసరావు తెలిపారు.


Updated Date - 2021-02-28T07:10:11+05:30 IST