పేద రైతు బ్యాంకు ఖాతాలో ఉన్నట్టుండి లక్షల నగదు ప్రత్యక్షం.. ఉక్కిరిబిక్కిరైన రైతు ఏం చేశాడో తెలుసా..

ABN , First Publish Date - 2022-02-11T02:40:28+05:30 IST

బ్యాంకు ఖాతాలో అనుకోకుండా లక్షల్లో జమ అయ్యాయనే వార్తలను అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అలాంటి ఘటనే మహరాష్ట్రలో జరిగింది. ఖాళీగా ఉన్న అతడి బ్యాంకు ఖాతా... ఉన్నట్టుండి కళకళలాడింది. ఒకటి కాదు రెండు కాదు..

పేద రైతు బ్యాంకు ఖాతాలో ఉన్నట్టుండి లక్షల నగదు ప్రత్యక్షం.. ఉక్కిరిబిక్కిరైన రైతు ఏం చేశాడో తెలుసా..

బ్యాంకు ఖాతాలో అనుకోకుండా లక్షల్లో జమ అయ్యాయనే వార్తలను అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. అలాంటి ఘటనే మహరాష్ట్రలో జరిగింది. ఖాళీగా ఉన్న అతడి బ్యాంకు ఖాతా... ఉన్నట్టుండి కళకళలాడింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కసారిగా ఏకంగా రూ.15లక్షలు వచ్చి పడ్డాయి. నిరుత్సాహంగా ఏటీఎం గదిలోకి వెళ్లి బ్యాంకు ఖాతా చెక్ చేసుకున్న పేద రైతు.. అమితమైన ఆనందంతో బయటికొచ్చాడు. ఎప్పుడు చూసినా వందల రూపాయల్లో ఉండే అతడి ఖాతా.. ఒక్కసారిగా లక్షల్లోకి రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆ డబ్బులతో చివరికి ఏం చేశాడంటే..


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా దావర్‌వాడీ గ్రామానికి చెందిన ధ్యానేశ్వర్ జనార్ధన్ ఔటే అనే వ్యక్తి తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తుండేవాడు. చాలీచాలని సంపాదనతో జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. తన బ్యాంకు ఖాతాలో డబ్బు ఎంతుందో చూసుకునేందుకు ఓ రోజు ఏటీఎంకి వెళ్లాడు. తీరా చెక్ చేసి షాక్ అయ్యాడు. వందల్లో ఉన్న అతడి ఖాతాలో ఒక్కసారిగా రూ.15లక్షలు వచ్చిపడ్డాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తర చిరకాల కోరికలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఏకంగా రూ.9లక్షలు ఖర్చు చేసి అందమైన ఇల్లు కట్టుకున్నాడు. హమ్మయ్య.. అనుకుంటున్న సమయంలో అతడికి గ్రామ పంచాయతీ నుంచి ఓ లేఖ వచ్చింది. అందులో ‘‘జిల్లా పరిషత్ నుంచి పింపల్‌వాడీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు.. పొరపాటున మీ అకౌంట్‌లో జమ అయ్యాయి. ఆ నగదును తిరిగి చెల్లించాల్సిందిగా కోరుతున్నాం’’ అని ఉండడం చూసి ఖంగుతిన్నాడు. తన అకౌంట్‌లో ఉన్న రూ.6లక్షలను అధికారులు తీసుకోగా... మిగతా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయింది.

పిచ్చుక మృతితో గ్రామమంతా శోకసంద్రం.. దాని మీద ప్రేమతో ప్రజలంతా ఏం చేశారంటే..

Updated Date - 2022-02-11T02:40:28+05:30 IST