లఖింపూర్ ఖేరీ కేసు : కేంద్ర మంత్రి కుమారునికి బెయిలు మంజూరు

ABN , First Publish Date - 2022-02-10T19:44:54+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన

లఖింపూర్ ఖేరీ కేసు : కేంద్ర మంత్రి కుమారునికి బెయిలు మంజూరు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన ఈ సంఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆశిష్‌ను గత సంవత్సరం అక్టోబరు 9న అరెస్టు చేశారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు ప్రస్తుతం రద్దయ్యాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రైతులపై నుంచి వాహనాలు  దూసుకెళ్ళడంతో నలుగురు రైతులు, కారు డ్రైవర్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ఛార్జిషీట్‌లో ఆరోపించింది. ఆయనను గత ఏడాది అక్టోబరు 9న అరెస్టు చేశారు. 


Updated Date - 2022-02-10T19:44:54+05:30 IST