Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలకు లఖిదాసుపురం విద్యార్థులు

నందిగాం: విజయవాడలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయిలో కళా ఉత్సవానికి లఖిదాసుపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు  చమళ్ల సాత్విక, వంకల హేమసుందర రావు ఎంపికయ్యారని హెచ్‌ఎం చిలుకు కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు డీఈవో బి.లింగే శ్వరరెడ్డి నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. ఈనెల 2న విద్యాశాఖ, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో వీరు పాల్గొని విజేతలుగా నిలిచారన్నారు. సాత్విక శిల్పకళ 3డి విభాగం, హేమసుందరరావు జానపద నృత్యం విభాగంలో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ డా.బీఆర్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌ సామాజిక భవనంలో జరిగే కళా ఉత్సవాల్లో  పాల్గొంటారని పేర్కొన్నారు.

  

Advertisement
Advertisement