Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రేమ జంటకు ఊహించని షాకిచ్చిన యూనివర్శిటీ..!

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని ప్రముఖ లాహోర్ యూనిర్శిటీ ఓ ప్రేమ జంటకు ఊహించని షాకిచ్చింది. యూనివర్శిటీ ఆవరణలో ఓ విద్యార్థిని మరో విద్యార్థికి ప్రపోజ్ చేసినట్టు యూనివర్శిటీ దృష్టికి రావడంతో అధికారుల వారిద్దరినీ యూనివర్శిటీ నుంచి శాశ్వతంగా తొలగించారు. మోకాళ్లపై కూర్చుని తన ఫ్రెండ్‌కు ఆమె ప్రపోజ్ చేస్తుండగా తీసిన వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయింది. తొటి విద్యార్థుల చపట్లు కొడుతుండగా..ఆమె తన మనసులో మాట బయటపెడుతుంది. ఇందుకు అతడు సమ్మతిండం..ఆమెను ఆలింగనం చేసుకోవడం..ఇదంతా చూస్తున్న తొటి విద్యార్థులు చప్పట్లతో వారిని అభినందించనట్టు ఉన్న వీడియో ఇటీవల విపరీతంగా వైరల్ అయింది. ఇదే చివరికి వారి కొంప ముంచింది. 

అయితే.. ఈ ఘటనపై యూనివర్శిటీ ప్రవర్తనా నియమావళి కమిటీ ముందు వివరణ ఇచ్చేందుకు ఆ ఇద్దరు విద్యార్థులకు అవకాశం ఇచ్చినా వారు కమిటీ ముందు హాజరు కాలేదని యూనివర్శిటీ అధికారులు తెలిపారు. దీంతో.. వారిని యూనిర్శిటీ నుంచి తొలగించాల్సి వచ్చిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో..వారిరువురూ ఆ యూనిర్విటీలో చుదువుకునే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోయారు. అయితే..పాక్ నెటిజన్లు మాత్రం యూనివర్శిటీపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఓవైపు బాల్యవివాహాలకు పరోక్ష మద్దతునిస్తూ, మరోవైపు..ప్రేమ జంటలపై ఇటువంటి ఆంక్షలు విధుస్తున్న పాక్ అధికారుల నైతికత ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలవుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement