మహిళా పోలీసు అధికారికి అరుదైన సన్మానం

ABN , First Publish Date - 2022-03-11T17:04:50+05:30 IST

అవినీతి నిరోధక దళం(ఏసీబీ)లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా సేవలందిస్తున్న నజ్మా ఫరూఖిని ‘రేవా’ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మానించింది.

మహిళా పోలీసు అధికారికి అరుదైన సన్మానం

బెంగళూరు: అవినీతి నిరోధక దళం(ఏసీబీ)లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా సేవలందిస్తున్న నజ్మా ఫరూఖిని ‘రేవా’ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మానించింది. ఈమేరకు క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో నజ్మా ఫరూఖిని రేవా యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ పీ శ్యామరాజు సన్మానించి అభినందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నజ్మా ప్రత్యేక అతిథి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2022-03-11T17:04:50+05:30 IST