లొంగిపోయిన మహిళా మావోయిస్టు

ABN , First Publish Date - 2022-08-07T06:55:38+05:30 IST

చత్తీస్‌గడ్‌లో వివిధ ఘటనల్లో పాల్గొన్న మహిళా మా వోయిస్టు పొడియం జోగమ్మ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఓఎస్డీ కార్యాలయంలో శనివారం లొంగిపోయినట్టు రంపచోడవరం ఓఎస్డీ కృష్ణకాంత్‌ తెలిపారు.

లొంగిపోయిన మహిళా మావోయిస్టు
లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యురాలు జోగమ్మకు రివార్డు అందజేస్తున్న అల్లూరి జిల్లా రంపచోడవరం ఓఎస్డీ జి కృష్ణకాంత్‌

రంపచోడవరం ఓఎస్డీ జి కృష్ణకాంత్‌ వెల్లడి

చింతూరు, ఆగస్టు 6: చత్తీస్‌గడ్‌లో వివిధ ఘటనల్లో పాల్గొన్న మహిళా మా వోయిస్టు పొడియం జోగమ్మ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఓఎస్డీ కార్యాలయంలో శనివారం లొంగిపోయినట్టు రంపచోడవరం ఓఎస్డీ కృష్ణకాంత్‌ తెలిపారు. ఈమేరకు ఆయన చింతూరు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఎటపాక మండలం సాలేబుడిపేకు చెందిన జోగమ్మ అదే మండలం నర్సింగపాడు పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకుంది. సాలే బుడిపే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా ఉండడంతో అక్కడికి పలుమార్లు మావోయిస్టు నాయకులు గీత, సంధ్య తదితరులు రావడం జరిగింది. దీంతో జోగమ్మ ఆకర్షితురాలై దళంలో కలిసింది. ఈ క్రమంలో జోగమ్మను 2019లో దళ సభ్యురాలుగా పార్టీ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు జోగమ్మ తెలంగాణ రాష్ట్రం చర్ల ఏరియా కమిటీ సభ్యురాలుగా ప్రెస్‌టీమ్‌ సభ్యురాలుగా వ్యవహరించింది. ఛత్తీస్‌గడ్‌లోని జీరంగాట్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాల్గొని 21 మంది జవాన్ల మృతికి కారకురాలుగా ఉండి ఆ ఘటనలో పాల్గొన్న గీత, సంధ్యలను చాకచక్యంగా పోలీసుల వల నుంచి తప్పించింది. ఈ ఏడాది అదే రాష్ట్రం లో హక్క, దర్ధప్రాంతాలలో జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా పాల్గొంది. ఈ ఘ టనలో ఇరుపక్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని ఓఎస్డీ తెలిపారు. కాగా ప్ర జల నుంచి మావోయిస్టులపై వ్యతిరేకత పెరగడం, సహకారం లేకపోవడం, నూతన రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, వీటికి తోడు తన తల్లి ఇటీవల అనారోగ్యం బారిన పడి మృతి చెందడం, పోలీసులు.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితురాలై జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయం తీసుకుం దని ఆయన చెప్పారు. జోగమ్మ అలియాస్‌ రితిక అలియాస్‌ సుగుణపై ఒక లక్ష రూపాయల రివార్డును ప్రభుత్వం అందించడం జరిగిందని ఓఎస్డీ తెలిపారు. 



Updated Date - 2022-08-07T06:55:38+05:30 IST