మహిళా మావోయిస్టు లొంగుబాటు

ABN , First Publish Date - 2021-12-20T14:29:30+05:30 IST

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు తిరుపత్తూర్‌ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయింది. ఈ విషయమై వేలూరు డీఐజీ బాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం సిమోగా జిల్లాకు చెందిన ప్రభ

మహిళా మావోయిస్టు లొంగుబాటు

పెరంబూర్‌(చెన్నై): కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు తిరుపత్తూర్‌ జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయింది. ఈ విషయమై వేలూరు డీఐజీ బాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక రాష్ట్రం సిమోగా జిల్లాకు చెందిన ప్రభ అలియాస్‌ సంధ్య 2006లో అదృశ్యమై మావోయిస్టు దళంలో చేరిందని, ప్రశాంతమైన జీవనం సాగించాలని నిర్ణయించుకున్న ఆమె, శనివారం సాయంత్రం తిరుపత్తూర్‌ జిల్లా ఎస్పీ బాలకృష్ణన్‌ ఎదుట లొంగిపోయిందన్నారు. ఆమెకు రాష్ట్రప్రభుత్వం తరఫున రూ.1.5 లక్షల నుండి రూ.2.5 లక్షల వరకు పునరావాస నిధి, మూడేళ్లు నెలకు రూ.4 వేల చొప్పున అందజేయనున్నామని తెలిపారు.

Updated Date - 2021-12-20T14:29:30+05:30 IST