Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ నెక్ట్స్ సీఎం కాలేవ్.. మహిళా అభిమాని స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతి: నమ్మి ఓట్లేస్తే ముఖ్యమంత్రి నట్టేట ముంచారంటూ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి అభిమానులే మండిపడుతున్నారు. ఐదు రోజులుగా తిరుపతి టీటీడీ ఏడీ బిల్డింగ్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి, టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోడంలేదని టీటీడీ ఎఫ్.ఎం.ఎస్. కాంట్రాక్ట్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అన్నా అని అభిమానంతో పిలుచుకున్న తమను నడిరోడ్డుపై నిలబెట్టావా?’ అంటూ జగన్‌పై అభిమానంతో "టాటు" వేసుకున్న మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 


వీరాభిమాని అయిన మహిళా కార్మికురాలు సీఎం జగన్‌పై మండిపడ్డారు. తాను జగన్ వీరాభిమానని, తాను టాయిలెట్‌లు కడిగి సంపాదించిన మొదటి నెల జీతంతో జగన్ బొమ్మను టాటు వేయించుకున్నానని ఆమె తెలిపారు. జగన్ సీఎం అయితే చెప్పులు ధరించకుండా ఉంటానని, స్వామివారికి తలనీలాలు సమర్పించానని ఆమె గుర్తుచేశారు.జగన్‌పై అభిమానం పెంచుకున్నందుకు ఈరోజు తమకు తగిన శాస్తి జారిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల శాపం రాష్ట్ర ప్రభుత్వానికి తగలకుముందే మేలుకుని టీటీడీ కార్మికులకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. Advertisement
Advertisement