Abn logo
Mar 4 2021 @ 00:01AM

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

దేవరపల్లి, మార్చి 3: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన బుధవారం దుద్దుకూరులో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఆత్కూరి సరిత (31) నోటి నుంచి నురుగలు వచ్చినట్టు కనిపించడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నా రు. సరిత తల్లి వెంకటలక్ష్మి మాట్లాడుతూ సుధీర్‌తో పదకొండేళ్ల కిందట పెళ్లైందని ఒక నెల కిందట పెద్దమనుషుల సమక్షంలో తగువు నిర్వహించి కుమార్తెను తీసుకెళ్లారని బుధవారం తన కుమార్తె ఆరోగ్యం బాగోలేదని ఫోన్‌ చేశారని వచ్చి చూసేటప్పటికి విగత జీవిగా పడి ఉందని అల్లుడు, కుటుంబ సభ్యులే హత్యచేసి ఉంటారని ఆరోపించారు. సరితకు కుమార్తె తరుణశ్రీ ఉందన్నారు. కొవ్వూరు రూరల్‌ సీఐ ఎం.సురేశ్‌, ఎస్‌ఐ కె.స్వామి ఘటన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మాట్లాడుతున్నా.. నా వద్ద రిపోర్టు  ఉంది.. అపుడు చెబుతాను... ఇలా వలంటీర్‌ తో ఫోన్‌ సంభాషణ వైరల్‌ అవుతోంది. 

Advertisement
Advertisement
Advertisement