Abn logo
Mar 7 2021 @ 06:59AM

ఆ వీడియో రికార్డులతో కిలాడీలేడీ బెదిరింపులు!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఫేస్‌బుక్‌ ద్వారా ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువకుడిని ఎంచుకుని ట్రాప్‌ చేసిన ఓ కిలాడీలేడీ డబ్బులకోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. నగరానికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో అతడి స్థాయిని సూచించేలా ఫొటోలు పోస్టుచేసేవాడు. ప్రైవసీ పాలసీ లేకపోవడం అవకాశంగా మలుచుకున్న ఓ కిలాడీలేడీ అతడి నెంబర్‌కు వాట్సాప్‌ వీడియోకాల్‌ చేసి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ముగ్గులోకి దింపింది.


న్యూడ్‌గా వీడియోలో మాట్లాడినవి రికార్డ్‌చేసిన కిలాడీ లేడీ తర్వాత అతడిని బ్లాక్‌మెయిల్‌చేయడం మొదలెట్టింది. ఆ వీడియోలను అతడి భార్యకు, ఎఫ్‌బీ ఫ్రెండ్స్‌ లిస్టులో ఉన్న వారందరికీ పంపిస్తానంటూ బెదిరించింది. దీంతో బాధితుడు రూ.22వేలు ఒకసారి పంపించాడు. మళ్లీ ఫోన్‌చేసి లక్షల మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్‌ చేయడంతో అతడు శనివారం సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement
Advertisement