చురుగ్గా మహిళలకు వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-06-18T04:21:35+05:30 IST

మహిళా సంఘాలకు మాత్రమే ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

చురుగ్గా మహిళలకు వ్యాక్సినేషన్‌
వ్యాక్సిన్‌ కోసం వేచి ఉన్న మహిళలు

పాల్వంచ టౌన్‌, జూన్‌ 17: మహిళా సంఘాలకు మాత్రమే ప్రారంభించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. బొల్లోరుగూడెం హైస్కూల్‌లో ప్రారంభించిన మహిళలకు వ్యాక్సినేషన్‌ మొదటి రోజు 200 మందికి, గురువారం 403 మందికి మొత్తం 603 మంది మహిళలకు వ్యాక్సినేషన్‌ చేశారు. అదేవిధంగా కేటీపీఎస్‌ ఉద్యోగులు బ్యాంక్‌ సిబ్బంది, ఆటో డ్రైవర్లు మొత్తం 454 మందికి వ్యాక్సినేషన్‌ను అందజేశారు. మహిళా సంఘాలు కేటీపీ ఎస్‌ బ్యాంక్‌ సిబ్బంది, ఆటో డ్రైవర్స్‌ మొత్తం కలిపి 1,057 మందికి వ్యాక్సిన్‌ వేయడం జరిగింది. వ్యాక్సినేషన్‌ సజా వుగా సాగేందుకు మునిసిపల్‌, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల వారికి ముందస్తుగా టోకెన్‌లు జారీ చేసి దాని ప్రకారంగా వ్యాక్సినేషన్‌ను అందజేస్తున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ చింత శ్రీకాంత్‌, ఆర్‌ఓ ప్రకాష్‌, వ్యాక్సినేషన్‌ కేం ద్ర వైద్యాధికారి డాక్టర్‌ తేజశ్రీ తదితరుల పర్యవేక్షణలో టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. 


Updated Date - 2021-06-18T04:21:35+05:30 IST