ఆ ఆసుపత్రి వార్డులకు గల్వాన్ అమర జవాన్ల పేర్లు

ABN , First Publish Date - 2020-07-04T04:03:30+05:30 IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఛతార్‌పూర్ ప్రాంతంలోని రాధా స్వామి సత్సంగ్ ఆవరణలో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఆసుపత్రిలో వార్డులకు గల్వాన్‌ ఘటనలో అమరులైన జవాన్ల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది.

ఆ ఆసుపత్రి వార్డులకు గల్వాన్ అమర జవాన్ల పేర్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఛతార్‌పూర్ ప్రాంతంలోని రాధా స్వామి సత్సంగ్ ఆవరణలో కొత్తగా నిర్మించిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ఆసుపత్రిలో వార్డులకు గల్వాన్‌ ఘటనలో అమరులైన జవాన్ల పేర్లు పెట్టాలని నిర్ణయించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. సైన్యం నిర్మించిన ఈ అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిలో రెండు వేల మంది ఐటీబీపీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బలగాలు, డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఏకకాలంలో పది వేల మంది రోగులకు చికిత్స అందించే సౌకర్యాలున్నాయి. 


మోదీ లడక్ పర్యటన నేపథ్యంలో ఆసుపత్రిలోని వార్డులకు గల్వాన్ అమర జవాన్ల పేర్లు పెట్టాలని డీఆర్‌డీఓ  నిర్ణయించింది. జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నాయి. 

Updated Date - 2020-07-04T04:03:30+05:30 IST