మెడికల్‌ దుకాణాలపై కొరవడిన నిఘా

ABN , First Publish Date - 2021-05-17T05:16:03+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో ఏడాదికాలంగా మందుల దుకాణదారులుకు కాసులపంట పండుతోంది. హిందూపురం ప్రాంతంలో పదుల సంఖ్యలో మెడికల్‌ షాపులున్నాయి.

మెడికల్‌ దుకాణాలపై కొరవడిన నిఘా

- అధిక ధరలకు విక్రయాలు 

-పట్టించుకోని వైద్యశాఖ అధికారులు

హిందూపురం టౌన, మే 16: కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో ఏడాదికాలంగా మందుల దుకాణదారులుకు కాసులపంట పండుతోంది. హిందూపురం ప్రాంతంలో పదుల సంఖ్యలో మెడికల్‌ షాపులున్నాయి. మరికొంతమంది ఆర్‌ఎంపీ వైద్యులు అనుమతులు లేకనే నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూ లాక్‌డౌన విధించినాకానీ మందుల దుకాణాలు తెరిచేందుకు అనుమతులున్నాయి. కొవిడ్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ముందుగా ఆర్‌ఎంపీ వైద్యులను సంప్రదించి ఆ తరువాత మందుల దుకాణాలను ఆశ్రయిస్తారు. ఇదే అదునుగా భావించి మెడికల్‌ షాపు నిర్వాహకులు అందినంత దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత యేడాదికంటే ఈ యేడాది మాత్రలు, సిర్‌ఫలపై అదనపు ధర పెంచేశారు. ఇక విటమిన్స టాబ్లెట్‌లపై అయితే సగానికి సగం ధర పెంచి విక్రయిస్తున్నారు. గత యేడాది పల్స్‌ ఆక్సిమీటర్‌ రూ.800నుంచి రూ.1200దాకా ఉండేది. ప్రస్తుతం 2వేల నుంచి రూ.3500దాకా విక్రయిస్తున్నారు. స్టీమ్‌(ఆవిరిపట్టే యంత్రం) రూ.200ఉండగా దానికి రూ.500- 700దాకా విక్రయిస్తున్నారు. యాంటిబైటిక్‌ మాత్రలపై ధరలు విపరీతంగా పెంచారు. విచ్చలవిడిగా ధరలు పెంచి అమ్ముతున్నా ఔషద నియంత్రణశాఖ అధికారులు చూసిన దాఖలాలు లేవు. ఒక వేళ తనిఖీలు చేసినా గుట్టు చప్పుడు కాకుండా మొక్కుబడిగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొవిడ్‌ ఉదృతివేళ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తరచూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇలాంటి సందర్భంలో వారు మెడికల్‌ షాపులపై దాడిచేసినట్లు కనబడటంలేదు. మెడికల్‌ దుకాణాల్లో ధరలు నియంత్రించాలని రోగులు కోరుతున్నారు. 

కరువైన అధికారుల నియంత్రణ ఏది ?

మెడికల్‌ షాపులపై నిఘా కొరవడింది. డ్రగ్స్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు, సిబ్బంది కార్యాలయాల నుంచి బయటికి కూడా రాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఉదాహరణ మెడికల్‌షాపుల్లో మందులు అధికశాతం విక్రయిస్తున్నారని రోగులు, వారి బంధువులు ఓ ప్రజాప్రతినిధివద్ద వారం క్రితం గోడు వెల్లబోసుకున్నారు. అంతేకాక అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆధారాలు కూడా ప్రజాప్రతినిధికి చూపడంతో వెంటనే డ్రంగ్స్‌ కంట్రోల్‌ అధికారులకు ఫోనచేశారు. అయినా వారి నుంచి వారం గడిచినా ఎలాంటి స్పందన రాలేదంటూ ఆ పార్టీనాయకులే పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ రోగులకు అందించే  అత్యవసర మందులు, ఇంజెక్షన నిలువ బాధ్యతలను అప్పగించడమే ఇందుకు కారణమని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయినా మరికొంతమంది సిబ్బంది మందుల షాపులపై దాడులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మందుల దందా కొనసాగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా డ్ర గ్స్‌ కంట్రోల్‌ అధికారులు మెడికల్‌ షాపులపై దాడులు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కొవిడ్‌ బాదితులు, ఇతర రోగులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-17T05:16:03+05:30 IST