Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆకలిపై నిద్రలేమి ప్రభావం

ఆంధ్రజ్యోతి(04-04-2020)

నిద్రలేమి కారణంగా అతిగా తినడం, చెడు ఆహార అలవాట్లకు దారి తీస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. నిద్రలేమితో బాధపడేవారు కుకీస్, క్యాండీస్, చిప్స్ వంటి నోరూరించే తిళ్లను చూసి తమను తాము నిలువరించుకోలేరని పరిశోధకులు తెలిపారు. 

  ఓ రెండుగంటల ముందు కడుపు నిండా తిన్నా ఈ సమస్య కనిపిస్తుందని వివరించారు. ఆకలిపై నిద్రలేమి ప్రభావం మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం వేళకు ముందుగా అత్యంత తీవ్రంగా కనిపిస్తుందని షికాగో విశ్వవిద్యాలయం పరిశోధకులు వివరించారు. నిద్ర తగ్గినవారిలో ఆహారం తీసుకోవాలనే కోరిక పెరిగి, తినడం ద్వారా ఆనందం, సంతృప్తి పొందుతారనీ పరిశోధకులు పేర్కొన్నారు. 2ఏజీ రసాయన స్థాయిల్ని పరిశీలించడం ద్వారా ఈ అంశాల్ని నిర్ధారించారు.

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement