పార్కులో వసతుల లేమి!

ABN , First Publish Date - 2022-04-04T05:16:08+05:30 IST

అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్‌-హైదరాబాద్‌ ప్రధాన రోడ్డు పక్కనే సహజసిద్ధమైన అటవీప్రాంతాన్ని అర్బన్‌పార్కుగా తీర్చిదిద్దా ్దరు..

పార్కులో వసతుల లేమి!

 నత్తనడకన సాగుతున్న కాటేజీల నిర్మాణం   

నర్సాపూర్‌ అర్బన్‌ పార్కులో  రెండేళ్లుగా సాగుతున్న కాటేజీల నిర్మాణం

చిన్నారులకు ఆటవస్తువులు కరువు

 నిధుల కొరత వల్లే పనులు ఆలస్యం

పర్యవేక్షణ, నిఘా అంతంతే!!


నర్సాపూర్‌, ఏప్రిల్‌ 3: అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సాపూర్‌-హైదరాబాద్‌ ప్రధాన రోడ్డు పక్కనే సహజసిద్ధమైన అటవీప్రాంతాన్ని అర్బన్‌పార్కుగా తీర్చిదిద్దా ్దరు.. కానీ అందులో పర్యాటకుల కోసం సరైన ఏర్పా ట్లు లేవు. నర్సాపూర్‌ అర్భన్‌ పార్కుకు ఆదివారం, సెలవుదినాల్లో పర్యాటకుల తాకిడి అధికంగా ఉం టుంది. నిధులు సకాలంలో రాకపోవడంతో సరైన వసతులు లేవు. నిధులు లేకపోవడం వల్లే పనులు కూడా సాఫీగా సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నత్తనడకన కాటేజీల నిర్మాణం

అర్భన్‌ పార్కుకు వచ్చే వారు సేద తీరేందుకు రూ.1.20కోట్లతో ఆరు కాటేజీల నిర్మాణాన్ని పార్కు సమీపంలో నిర్మించాలని నిర్ణయించి రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు.  ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. రూ.1.20కోట్లతో ఆరు కాటేజీలు, రెండు అతిథిగృహాలు, భోజనశాల నిర్మించాలి. కానీ నిధులు సకాలంలో మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులను పూర్తిచేయడం లేదు. పర్యాటకులు భోజనం చేయడానికి, కాసేపు సేదతీరడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. 

ఆట వస్తువులు  లేవు 

 పార్కులో పిల్లలకు ఎటువంటి ఆటవస్తువులూ లేవు. పార్కులో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన కొన్ని ఆటవస్తువులను ఏర్పాటు చేస్తామని అటవీఅధికారులు పేర్కొంటున్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. పార్కులో కేవలం సహజసిద్ధంగా ఉన్న చెట్లతో పాటు ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్‌టవర్‌ మాత్రమే పర్యాటకులకు ఆకట్టుకునే విధంగా ఉంది. పార్కు చుట్టు సైక్లింగ్‌ కోసం కూడా ట్రాక్‌ ఏర్పాటు చేసినా సైకిళ్లు ఇంకా అందుబాటులో లేవు. 

  నిఘా, పర్యవేక్షణ చర్యలేవి?

సహజసిద్ధంగా ఉన్న అటవీప్రాంతంలో అర్భన్‌ పార్కు ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా పార్కులో సరైన నిఘా, పర్యవేక్షణ లేకపోవడం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. కేవలం టికెట్‌ కౌంటర్‌ వద్ద ఒకరు, మరొక సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. పార్కుకు వచ్చే వారిపై పర్యవేక్షణ పూర్తిస్థాయిలో లేదని స్పష్టమవుతుంది. సెలవు రోజుల్లో, ఆదివారం వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుండగా మిగతా రోజుల్లో యువతీ యువకులు ఎక్కువగా వస్తున్నారు. ఈ క్రమంలో పార్కులో పర్యటించే వారు పార్కులో ఎక్కడికి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.  పార్కు లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2022-04-04T05:16:08+05:30 IST