తిరుమల: టీటీడీ చైర్మన్, అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. ఉదయం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చైర్మన్ పరిశీలించారు. తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని15 రోజుల పాటు వాయిదా వేసుకోమని భక్తులకు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రయాణం వాయిదా వేసుకోలేని భక్తులు తిరుమలకు వస్తే స్వామి వారి దర్శనం చేయిస్తామని చైర్మన్ చెప్పారు. అయితే సాయంత్రానికి తిరుమలకు భక్తులు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవంటూ ఈవో జవహర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుమల, తిరుపతి మధ్య 4,300 వాహనాలు రాకపోకలు సాగించాయంటూ ప్రకటనలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్, ఈవో పరస్పర విరుద్ధ ప్రకటనలతో శ్రీవారి భక్తులు అయోమయంలో పడ్డారు.