అత్యుత్తమ ఇండియన్ బౌలర్, బ్యాటర్ ఎవరో చెప్పిన మార్నస్ లబుషేన్

ABN , First Publish Date - 2022-01-10T21:57:27+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుగా కొనసాగుతున్న టీమిండియాలో అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ ఎవరు? ఈ ప్రశ్నకు ..

అత్యుత్తమ ఇండియన్ బౌలర్, బ్యాటర్ ఎవరో చెప్పిన మార్నస్ లబుషేన్

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుగా కొనసాగుతున్న టీమిండియాలో అత్యుత్తమ బ్యాటర్, బౌలర్ ఎవరు? ఈ ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెబుతారు. మరి ఆసీస్ బ్యాటర్ లబుషేన్  దృష్టిలో ఎవరు? ఈ ప్రశ్నకు అతడే సమాధానం చెప్పాడు. ట్విట్టర్‌లో నిర్వహించి ‘క్యూ అండ్ ఎ’ సెషన్‌లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. విరాట్ కోహ్లీని అత్యుత్తమ బ్యాటర్‌గా, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బెస్ట్ బౌలర్‌గా చెప్పుకొచ్చాడు. భారత జట్టులో తాను ఎదుర్కొన్న వారిలో వీరిద్దరే బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్ అని మార్నస్ పేర్కొన్నాడు.


యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతున్న ఆస్ట్రేలియా జట్టులో లబుషేన్ సభ్యుడు. పాట్ కమిన్స్ సారథ్యంలో ఆసీస్ జట్టు ఇప్పటికే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వరుసగా మూడు టెస్టులను ఆస్ట్రేలియా గెలుచుకోగా, నాలుగో టెస్టు డ్రా అయింది. చివరి టెస్టు హోబర్ట్‌లో జరగనుంది.   

Updated Date - 2022-01-10T21:57:27+05:30 IST