ప్రారంభానికి అగ్రి ల్యాబ్‌లు సిద్ధం

ABN , First Publish Date - 2021-06-18T04:07:09+05:30 IST

జిల్లా, నియోజకవర్గ స్థాయిలో 4 అగ్రిల్యాబ్‌లు జులై 8న ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఆనంద కుమారి తెలిపారు.

ప్రారంభానికి అగ్రి ల్యాబ్‌లు సిద్ధం
ప్రారంభానికి సిద్ధిమైన అగ్రి ల్యాబ్‌ను పరిశీలిస్తున్న జేడీ ఆనందకుమారి

కోవూరు, పొదలకూరు, గూడూరు, వెంకటగిరిలలో సిద్ధం

8న ప్రారంభించనున్న సీఎం జగన

పొదలకూరులో భవనాన్ని పరిశీలించిన జేడీ 


పొదలకూరు, జూన 17 : జిల్లా, నియోజకవర్గ స్థాయిలో 4 అగ్రిల్యాబ్‌లు జులై 8న ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఆనంద కుమారి తెలిపారు. గురువారం పొదలకూరు ఏడీఏ కార్యాలయాన్ని, నిమ్మ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని తుది మెరుగులు దిద్దుకుంటున్న నియోజకవర్గ స్థాయి అగ్రిల్యాబ్‌ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జూలై 8న దివంగత నేత వైఎస్సార్‌ పుట్టిన రోజున కోవూరు, పొదలకూరు, గూడూరు, వెంకటగిరిలలో అగ్రి ల్యాబ్‌లను సీఎం జగన వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలోని నియోజకవర్గ స్థాయిలో 8 చోట్ల అగ్రి ల్యాబ్‌లు మంజూరయినట్లు తెలిపారు. ఒక్కో ల్యాబ్‌కు రూ.55 లక్షలు  చొప్పున రూ.8 కోట్లు మంజూరయినట్లు తెలిపారు. నాబార్డు ద్వారా నిధులు మంజూరు కాగా పనులు పర్యవేక్షణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన చూస్తోందన్నారు. రైతుల నుంచి సేకరించిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ ల్యాబ్‌లలో పరీక్షిస్తారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎడగారులో 45వేల హెక్టార్లలో వరి నారుమళ్లు వేయాల్సి ఉండగా కరోనా కారణంగా 23వేల హెక్టార్లలోనే వేశారని చెప్పారు. అలాగే 1010 రకం లావు గింజలు వేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు ఏడీఏ నాగేశ్వరరావు, ఏవో (ల్యాబ్‌ ఇనచార్జి), శ్రీదేవి, ఏఈవో ఏడుకొండలు నాయక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T04:07:09+05:30 IST