రక్షణ రంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి

ABN , First Publish Date - 2021-07-24T07:34:28+05:30 IST

రక్షణ రంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ పలు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. శుక్రవారం గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూఐ, ఎఫ్‌టీయూ తదితర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.

రక్షణ రంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి
ఆందోళన చేపడుతున్న కార్మిక సంఘాలు.

పలు కార్మిక సంఘాల ఆందోళన 


నెల్లూరు(వైద్యం), జూలై 23 : రక్షణ రంగాన్ని కాపాడండి... దేశాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ పలు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. శుక్రవారం గాంధీబొమ్మ వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూఐ, ఎఫ్‌టీయూ తదితర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి.  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వం చివరకు రక్షణ రంగాన్ని కూడా వదలటం లేదని విమర్శించారు. రక్షణ రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేలా వ్యవహరిస్తోందని ఆగ్రహించారు. దీనిని వ్యతిరేకించిన డిఫెన్స్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కార్మికుల నోరునొక్కేందుకు యత్నిస్తోందన్నారు. వారి సమ్మె హక్కును కూడా రద్దు చేసిందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీ నుంచి డిఫెన్స్‌ రంగంలోని కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టాలని పిలుపు నిచ్చారన్నారు. వారికి కార్మిక సంఘాలన్నీ మద్దతు తెలుపుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు, ఏఐఏపీయూ రాష్ట్ర కార్యదర్శి అంజనేయులు, ఐఎస్టీయూ జిల్లా కార్యదర్శి సాగర్‌, సీఐటీయూ జిల్లా నేతలు అల్లాడి గోపాల్‌, అన్నపూర్ణమ్మ, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T07:34:28+05:30 IST