సీఈ బాలరాజుతో చర్చలు జరుపుతున్న నాయకులు
మృతదేహంతో బీటీపీఎస్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
మణుగూరు రూరల్, మార్చి 31: మండలంలోని బీటీపీఎస్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే అశ్వాపురం మండలం ఎస్సీకాలనీకి చెందిన గొల్లపల్లి రఘు(35) కొద్దిరోజుల క్రితం విధినిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు రసాయనం మీద పడింది. దీంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో బీటీపీఎస్ ఎదుట అందోళనకు దిగారు. అఖిలపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు మద్దతు తెలపడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది మృతుడి కుటుంబానికి రూ. 30 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సీఈ బాలరాజు, బీహెచ్ఈఎల్ జీఎం, కెమికల్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఎట్టకేలకు మృతుడి కుటుంబానికి 20 లక్షలు పరిహారం చెల్లించేందుకు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు యాదగిరిగౌడ్, ముద్దంగుల కృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య, ఎంపీటీసీ రామారావు, కాంగ్రెస్ నాయకులు గోపి, ఇక్బాల్‌హుస్సేన్ పాల్గొన్నారు.