కార్మిక హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-11-01T07:55:08+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కార్మి కుల హక్కులను హరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కల వేణ శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి మేకల దాసులు

కార్మిక హక్కులను హరిస్తున్న  ప్రభుత్వాలు

సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్‌ 


మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 31: బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కార్మి కుల హక్కులను హరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కల వేణ శంకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా కార్యదర్శి మేకల దాసులు పేర్కొన్నారు. శనివారం ఏఐటీయూసీ యూనియన్‌ స్థాపించి వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమావేశంలో వారు మాట్లాడు తూ, దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కారుచౌకగా అమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమర్శించారు. అసంఘటిత, ఆర్థిక సమస్యల ను పరిష్కరించేందుకు కనీసం అవకాశం కల్పించడం లేదని, కార్మికులను బానిసలుగా చూస్తూ కనీస వేతనం ఇవ్వకుండా హింసకు గురిచేస్తోందన్నా రు. ఎల్‌ఐసీ, రైల్వే, విమానయానం తదితర రంగాలలో 10 శాతం వాటాల ను అమ్ముకొని ప్రైవేటుపరం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందు కు రంగం సిద్ధం చేసిందని, ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రతీ ఒక్కరు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.


తెలంగాణ రాష్ట్రం వస్తే అందరిని రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి కనీస వేతనాలు కూడా పెం చలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, లాక్‌డౌన్‌ సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించకపోతే దేశం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చ రించారు. ఏఐటీయూసీ నాయకులు రామడుగు లక్ష్మణ్‌, సీపీఐ పట్టణ కార్య దర్శి ఖలీందర్‌ఖాన్‌, ఉపాధ్యక్షుడు వి.వి.రావు, మిట్టపల్లి పౌలు, లింగయ్య, సర స్వతి, మల్లేష్‌, జాడి పోశం, చంద్రశేఖర్‌, అక్బర్‌ అలీ, కిషన్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T07:55:08+05:30 IST