కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-19T05:44:22+05:30 IST

కడప రీజియన్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం జమ్మలమడుగు ఆర్టీసీ డిపో గ్యారేజీ ఎదుట నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
జమ్మలమడుగు ఆర్టీసీ గ్యారేజీఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఎన్‌ఎంయూ కార్మికులు

జమ్మలమడుగు రూరల్‌, మే 18: కడప రీజియన్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతూ బుధవారం జమ్మలమడుగు ఆర్టీసీ డిపో గ్యారేజీ ఎదుట నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ డిపో సెక్రటరీ ఎంజీసీవో రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. సమస్యలపై అధికారులు చర్యలు తీసుకుని ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలన్నారు. 

బద్వేలు రూరల్‌..: మైదుకూరు డిపోలో ఎన్‌ఎంయూఏకు చెందిన ఉద్యోగులను ఎస్టీఐ వేధింపులకు గురి చేయడం తగదని డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జనార్దన్‌ రావు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రీజనల్‌ మేనేజర్‌ కోరిన నెల రోజుల గడువు పూర్తి అయినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో బుధవారం రీజియన్‌లో అన్ని డిపోలలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. టీ విరామ సమయంలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రీజియన్‌ పరిధిలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి చంద్రయ్య, గ్యారేజ్‌ కార్యదర్శి నాగేంద్ర, కెవి.రమణ, మల్లిఖార్జున, జ్యోసఫ్‌ ,  రఫి తదితరులు పాల్గొన్నారు. 

ప్రొద్దుటూరు క్రైం..: డిపోలో కొత్త చార్టు వేయాలని డిమాండు చేస్తూ, రీజనల్‌ కమిటీ పిలుపు మేరకు బుధవారం ప్రొద్దుటూరు డిపో ఆవరణలో డ్రైవర్లు, కండెక్టర్లు ధర్నా చేపట్టి నిరసన తెలియజేశారు. చాలా నెలలుగా కొత్త చార్టు వేయాలని కోరుతున్నా, అధికారులు స్పందించడం లేదని తెలిపారు. జోనల్‌ నాయకులు రామకృష్ణ, డిపో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టీఆర్‌జీరెడ్డి, సెక్రెటరీ భానుప్రసాద్‌, గ్యారేజీ సెక్రెటరీ అశోక్‌, జాయింట్‌ సెక్రెటరీ వీటీ రావు, డిపో నాయకులు డ్రైవర్లు, కండెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:44:22+05:30 IST