మా ఇంటి స్థలం ఎక్కడుందో..?

ABN , First Publish Date - 2021-01-19T07:06:52+05:30 IST

ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ స్థలం ఎక్కడుందో తెలీక నానా హైరానా పడ్డారు. అనంతపురం నగర ప్రజలకు మండలంలోని పసులూరు కొత్తపల్లిలో సోమవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

మా ఇంటి స్థలం ఎక్కడుందో..?

లబ్ధిదారుల్లో అయోమయం

అధికారుల కోసం సాయంత్రం 

వరకు పడిగాపులు


బుక్కరాయసముద్రం, జనవరి18:  ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు తమ స్థలం ఎక్కడుందో తెలీక నానా హైరానా పడ్డారు. అనంతపురం నగర ప్రజలకు మండలంలోని పసులూరు కొత్తపల్లిలో సోమవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నగరానికి చెందిన 28 వేల మందికీ పట్టాలు ఇక్కడే పంపిణీ చేస్తామని అధికారులు చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని ఉప్పరపల్లి, కామారపల్లి, నారాయణపురం, ఆలమూరు, బుక్కరాయసముద్రం మండలంలోని పసులూరు కొత్తపల్లిలో అధికారులు లేఔట్లు వేశారే తప్పా.. ఇంటి స్థలాలు ఎక్కడన్న దానిపై స్పష్టత ఇ వ్వలేదు. అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా ఎవరికి, ఎక్కడ ఇంటి పట్టా మంజూరు చేశారన్న సమాచారాన్ని లబ్ధిదారులకు అందించలేదు. దీంతో తమ స్థలం ఎ క్కడుందో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందారు. అధికారులందరూ కార్యక్రమంలోనే బిజీగా ఉండటంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పలేదు. తమ స్థలం ఎక్కడుందో తెలుసుకోవటానికి మ హిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇబ్బందులు పడ్డారు. ముందుస్తుగా లబ్ధిదారులకు లాటరీ ద్వారా ఎంపిక చేసి, సమాచారం ఇ వ్వలేదు. ఒక్కసారిగా అందరూ అక్కడికి రావటంతో ఇబ్బందులు తప్పలేదు. సమావేశం ఒంటి గంటకు ముగిసినా.. పట్టాల పంపిణీ సాయంత్రం వరకూ సాగింది. ఉదయాన్నే అక్కడకు చేరుకున్న లబ్ధిదారులు అన్నం, నీళ్లు లేక అలమటించారు. ఇంటి నుంచి భోజనాలు తెచ్చుకుని, కొందరు అక్కడే తినగా.. మరికొందరు ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2021-01-19T07:06:52+05:30 IST