ల్యాబ్‌ టెక్నీషియన సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2021-10-22T06:08:55+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో ల్యాబ్‌ టెక్నీషియన బాబురావు అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప కొనియాడారు.

ల్యాబ్‌ టెక్నీషియన సేవలు అభినందనీయం
బాబురావును సన్మానిస్తున్న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప


అనంతపురం క్రైం, అక్టోబరు 21: కొవిడ్‌ నేపథ్యంలో ల్యాబ్‌ టెక్నీషియన బాబురావు అందించిన సేవలు అభినందనీయమని ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప కొనియాడారు. ఈ మేరకు ఆయన తన చాంబర్‌లో గురువారం ల్యాబ్‌ టెక్నీషియన బాబురావును శాలువాతో సత్కరించి, అభినందించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సుమారు 5000 కొవిడ్‌ నమూనా పరీక్షలు చేశారన్నారు. దీంతో బాబురావు పనితీరును గుర్తించి, ప్రశంసించారు. కార్యక్రమంలో పోలీసు ఆస్పత్రి వైద్యులు వెంకటేశ్వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:08:55+05:30 IST