Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 09:09:17 IST

Laal Singh Chaddha: ట్విట్టర్ రివ్యూ

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్‌ (Amir Khan), కరీనా కపూర్ (Kareena Kapoor) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha). అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కీలక పాత్రలు పోషించారు. చైతూకి ఇది మొదటి హిందీ చిత్రం కావడం విశేషం. అందుకే అందరిలో ఆసక్తి బాగానే ఏర్పడింది. ఇక ఈ మూవీని ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు హిందీ రీమేక్‌గా అద్వెత్‌ చందన్‌ (Advait Chandan) రూపొందించారు. వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై.. ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తుండటంతో టాలీవుడ్‌లో కూడా ‘లాల్‌సింగ్‌ చడ్డా’పై బాగా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్‌కు కూడా మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్‌ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల షోస్ వేశారు. దీంతో ఈ సినిమా చూసిన అభిమనౌలు, ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దాని ప్రకారం లాల్‌సింగ్‌ చడ్డా స్టోరీ ఏంటి? ఎలా ఉంది? ఈ చిత్రం ఆమిర్‌ ఖాన్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందంటున్నారు..డెబ్యూ మూవీ చైతూకి ఎంతవరకు ఉపయోగపడనుంది అనే విషయాలను ట్విట్టర్‌ రివ్యూలో చూద్దాం.  


‘లాల్‌సింగ్‌ చడ్డా’ బ్యూటీఫుల్‌ ఫిల్మ్‌. థియేటర్స్‌లో చూడాల్సిన సినిమా ఇది. లాల్‌సింగ్‌గా ఆమిర్‌ తన మార్క్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అద్వెత్‌ చందన్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు..అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.  


3 ఇడియట్స్ తరువాత హిందీలో మళ్ళీ ఆమీర్ నుంచి ఓ మంచి సినిమా వచ్చింది. హృదయాన్ని హత్తుకునేలా లాల్ సింగ్ చడ్డా మూవీ ఉంది..అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక కొందరు ఫస్టాఫ్‌ ఫ్లాట్‌గా ఉందని, ఇంటర్వెల్‌ సీన్‌ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ టచ్ తో ఆకట్టుకుంది..అంటూ కామెంట్ చేస్తున్నారు. అద్భుతమైన సినిమా..దర్శకుడు అద్వైత్ మంచి సినిమాను అందించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. మొత్తంగా చూస్తే లాల్ సింగ్ చడ్డా చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. హిట్ టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో. 





Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement