Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్ చద్దా’ ఇండియన్ ఆర్మీని అవమానించింది: ఇంగ్లండ్ క్రికెటర్

ABN , First Publish Date - 2022-08-12T22:45:42+05:30 IST

విడుదలకు ముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమిర్ ఖాన్ (Aamir Khan) సినిమా లాల్‌సింగ్ చద్దా(Laal Singh Chaddha

Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్ చద్దా’ ఇండియన్ ఆర్మీని అవమానించింది: ఇంగ్లండ్ క్రికెటర్

న్యూఢిల్లీ: విడుదలకు ముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆమిర్ ఖాన్ (Aamir Khan) సినిమా లాల్‌సింగ్ చద్దా(Laal Singh Chaddha) మరోమారు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఇండియన్ ఆర్మీని, సిక్కులను అవమానించేలా ఉందని ఇంగ్లండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ (Monty Panesar) ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాలోని ‘ఫారెస్ట్ గంప్’(Forrest Gump) యూఎస్ ఆర్మీకి ఓకే కానీ ఇండియన్ ఆర్మీకి కాదని పేర్కొన్నాడు. వియత్నాం యుద్ధం కోసం అమెరికా అతి తక్కువ ఐక్యూ ఉన్న వారిని రిక్రూట్ చేసుకుందని పేర్కొన్నాడు. 


లాల్ సింగ్ చద్దా పూర్తిగా భారత సాయుధ దళాలను, సిక్కులను అగౌరవపరిచిందని ఆవేదన వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ #BoycottLalSinghChadda అని ట్వీట్ చేశాడు. అంతేకాదు, లాల్‌సింగ్ చద్దాలో ఆమిర్ ఖాన్ చిన్నారుల మనస్తత్వం ఉన్న వాడిలా నటించాడని, కానీ ఫారెస్ట్ గంప్ స్వతహాగా అలాంటి మనస్తత్వం కలవాడని అన్నాడు. మరో ట్వీట్‌లో ‘‘ఒక పద్మవిభూషణ్, ఒక పద్మభూషణ్, 21 ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్స్, 14 విక్టోరియా క్రాస్‌లు, రెండు పరమ్ వీర్‌చక్రలు, 4 అశోక్ చక్రలు, 8 మహావీర్ చక్రలు, 24 క్రీర్తి చక్రలు, 64 వీర్ చక్రలు, 55 శౌర్య చక్రలు, 375 సేనా మెడల్స్’’ అని పేర్కొంటూ #BoycottLalSinghChadda అని పేర్కొన్నాడు.  


మరోవైపు, లాల్‌సింగ్ చద్దాకు బాక్సాఫీసు వద్ద కూడా చుక్కెదురైంది. 15-20 శాతానికి మించి ఆక్యుపెన్సీ లభించడం లేదు. ఓపెనింగ్ రోజున అతి తక్కువగా రూ. 11.50 కోట్లు మాత్రమే కలెక్షన్లు లభించాయి. అయితే, అక్షయ్ కుమార్ సినిమా ‘రక్షాబంధన్’ (Raksha Bandhan) కంటే కొంత మెరుగైన ప్రదర్శన కనబరించింది. ఆ సినిమా రూ. 8 కోట్లు మాత్రమే వసూలు చేసింది. లాల్‌సింగ్ చద్దా ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్. 



Updated Date - 2022-08-12T22:45:42+05:30 IST