Advertisement
Advertisement
Abn logo
Advertisement

కెరీర్‌ ఆసాంతం వివక్ష ఎదుర్కొన్నా..

ఎల్‌.శివరామకృష్ణన్‌

కాన్పూర్‌: క్రికెట్‌లో జాతి, వర్ణ వివక్ష చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇంగ్లండ్‌ కౌంటీ మాజీ క్రికెటర్‌ అజీం రఫీక్‌ ఇదే విషయమై పోరాడుతున్నాడు. అలాగే తాను కూడా వర్ణ వివక్షను ఎదుర్కొన్నానంటూ భారత మాజీ స్పిన్నర్‌ ఎల్‌.శివరామకృష్ణన్‌ తెలిపాడు. ‘క్రికెటర్‌గా ఉన్నప్పుడు నన్నూ విమర్శించారు. అలాగే నా శరీర రంగును ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు వినిపించేవి. అయినా ఇవేమీ నన్ను బాధపెట్టలేదు. కానీ సొంత దేశంలోనూ ఇలాంటి వివక్షను ఎదుర్కోవడం దురదృష్టకరం’ అని ట్వీట్‌ చేశాడు. 2017లోనూ తమిళనాడు క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌ ఇదే విషయమై ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement