పనిమనిషిపై పైశాచికత్వం.. Kuwait మహిళకు 10 ఏళ్ల జైలు!

ABN , First Publish Date - 2021-11-21T14:28:20+05:30 IST

కువైత్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిమనిషిని యజమానురాలు, ఆమె భర్త తీవ్రంగా హించడంతో మృతిచెందింది.

పనిమనిషిపై పైశాచికత్వం.. Kuwait మహిళకు 10 ఏళ్ల జైలు!

కువైత్ సిటీ: కువైత్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిమనిషిని యజమానురాలు, ఆమె భర్త తీవ్రంగా హించడంతో మృతిచెందింది. తాజాగా ఈ కేసు కువైత్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన యజమానురాలికి న్యాయస్థానం పదేళ్లు, ఆమె భర్తకు ఏడాది  జైలు శిక్ష విధించింది. గృహకార్మికురాలిని బలవంతంగా పనిలో పెట్టుకోవడంతో పాటు తీవ్ర చిత్రహింసలతో ఆమె మృతికి కారణమైనందుకు కోర్టు కువైటీ దంపతులకు ఈ శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళను ఇంట్లో పనికి కుదుర్చుకున్న కువైటీ మహిళ ఆమెపై పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. ప్రతి చిన్న విషయానికి ఆమెను హింసించడం చేసింది. భర్తతో కలిసి ఆమెను తీవ్రంగా కొట్టడం, వాతలు పెట్టడం చేసింది. 


ఈ పైశాచికత్వం కొన్ని రోజులపాటు కొనసాగింది. దాంతో పనిమనిషి మృతిచెందింది. పోస్టుమార్టం సమయంలో ఆమె ఒంటినిండా కాల్చిన గాయాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు కువైటీ దంపతులపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు కువైత్ క్రిమినల్ కోర్టులో విచారణకు వచ్చింది. విచారణలో పనిమనిషిపై  యజమానురాలు, ఆమె భర్త తీవ్రంగా హింసించినట్లు తేలింది. దంపతులను దోషిగా తేల్చిన న్యాయస్థానం భార్యకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఆమె భర్తకు కూడా ఏడాది జైలు శిక్ష విధించింది.

Updated Date - 2021-11-21T14:28:20+05:30 IST