ఆ దేశానికి ఎవరూ వెళ్లకండి.. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేయండి: కువైత్

ABN , First Publish Date - 2022-01-03T14:32:54+05:30 IST

కువైత్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి.. కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుతున్న నేపథ్యంలో.. ప్రజలెవరూ యూకేకు వెళ్లొద్దని సూచించింది. ఇప్పటికే యూకేకు వెళ్లిన వాళ్లు

ఆ దేశానికి ఎవరూ వెళ్లకండి.. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేయండి: కువైత్

ఎన్నారై డెస్క్: కువైత్ ఆ దేశ ప్రజలను ఉద్దేశించి.. కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు విపరీతంగా పెరుతున్న నేపథ్యంలో.. ప్రజలెవరూ యూకేకు వెళ్లొద్దని సూచించింది. ఇప్పటికే యూకేకు వెళ్లిన వాళ్లు కూడా సాధ్యమైనంత త్వరగా బ్రిటన్‌ను వీడాలని యూకేలో ఉన్న కువైత్ ఎంబసీ తెలిపింది. కాగా.. గడిచిన 24 గంటల్లో యూకేలో 1.37లక్షల కొవిడ్ కేసులు నమోదైనట్టు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. 


ఇదిలా ఉంటే.. 50 సంవత్సరాలు దాటిని వారి కోసం బూస్టర్ డోస్ నిబంధనలను కువైత్ ప్రభుత్వం సడలించింది. ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి, టీకా తీసుకోవచ్చని తెలిపింది. ఈ మార్గదర్శకాలు సోమవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు పేర్కొంది. అయితే 50 సంవత్సరాలలోపు వాళ్లు మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. 




Updated Date - 2022-01-03T14:32:54+05:30 IST