Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత కమర్షియల్ విమానాలకు కువైత్ గ్రీన్‌సిగ్నల్!

కువైత్ సిటీ: భారత్ నుంచి కమర్షియల్ విమానాలకు గల్ఫ్ దేశం కువైత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, మంత్రివర్గ కమిటీ నిర్ధేశించిన కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని బుధవారం ఆ దేశ కేబినెట్ తన ప్రకటనలో పేర్కొంది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, ఈజిప్ట్ నుంచి కూడా విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రిమండలి వెల్లడించింది. దీంతో త్వరలోనే భారత్, కువైత్ మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో వైద్య నిపుణుల సూచనల మేరకు భారత్‌ సహా ఇతర దేశాల విమాన సర్వీసులపై కువైత్ నిషేధం విధించింది. ఏప్రిల్ నుంచి ఈ బ్యాన్ కొనసాగుతోంది. తాజా ప్రకటనతో ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులకు మార్గం సుగమమైంది. ఇక ఈ నెల 5వ తేదీ నుంచి యూఏఈ కూడా భారత ప్రయాణికులపై బ్యాన్‌ను తొలగించిన విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement