60ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో మరో సంచలన నిర్ణయం దిశగా Kuwait..?

ABN , First Publish Date - 2021-11-03T17:15:59+05:30 IST

కువైత్‌లోని 60 ఏళ్లకు పైబడిన వలసదారుల వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ సమస్య ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వీరి విషయంలో కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవాసులందరికీ ప్రైవేట్ ఆరోగ్య బీమాను తప్పనిసరి చేయాలని భావిస్తోందని సమాచారం.

60ఏళ్లకు పైబడిన ప్రవాసుల విషయంలో మరో సంచలన నిర్ణయం దిశగా Kuwait..?

ప్రత్యేక ప్రైవేట్ ఆరోగ్య బీమా తప్పనిసరి చేసే యోచనలో కువైత్!

కువైత్ సిటీ: కువైత్‌లోని 60 ఏళ్లకు పైబడిన వలసదారుల వర్క్, రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ సమస్య ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వీరి విషయంలో కువైత్ మరో సంచలన నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవాసులందరికీ ప్రైవేట్ ఆరోగ్య బీమాను తప్పనిసరి చేయాలని భావిస్తోందని సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రులలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోనుందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాధ్యసాధ్యాలపై సంబంధిత అధికారులు చర్చలు మొదలెట్టారని తెలిసింది. దీనిలో భాగంగా చట్టపరమైన చెల్లుబాటును పరిశీలించాల్సిందిగా ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అబ్దుల్లా అల్ సల్మాన్ ఫత్వా లెజిస్లేటివ్ కమిటీని అభ్యర్థించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.


అదే సమయంలో హైస్కూల్ విద్యార్హత లేని 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకునే విషయమై కూడా సంబంధిత అధికారులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, ఈ కేటగిరీ వలసదారులకు తాజాగా చర్చలో దశలో ఉన్న ప్రత్యేక ప్రైవేట్ ఆరోగ్య బీమాను వర్తింప చేయనున్నారని సమాచారం. వలసదారులు ఈ బీమాను తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మాత్రమే వారి రెసిడెన్సీ పర్మిట్లను పునరుద్ధరించుకోవడానికి అనుమతించబడతారని తెలుస్తోంది. 


ఇదిలాఉంటే.. యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని కువైత్ ఇటీవల వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేటగిరీ వలసదారుల వర్క్ పర్మిట్లు ఇకపై యధావిధిగా రెన్యూవల్ కానున్నాయి. 14 నెలల క్రితం పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లు దాటిన వలసదారులకు వర్క్ పర్మిట్ల జారీని ఆపేయాలని నిర్ణయించింది. అయితే, తాజాగా ఈ నిర్ణయాన్ని ఆ దేశ మంత్రి మండలికి చెందిన ఫత్వా, లెజిస్లేషన్ విభాగం రద్దు చేసింది. 


ఈ కేటగిరీ ప్రవాసులకు వర్క్ పర్మిట్‌లను జారీ చేయడాన్ని నిషేధించడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని వెల్లడించింది. 2020 ఆగస్టులో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జారీ చేసిన ఈ నిర్ణయం చట్టబద్ధంగా ఉనికిలో లేదని స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్ల జారీకి సంబంధించి ప్రత్యేకమైన నియమాలు, విధానాలు ఉన్నాయని తెలిపింది. 60 ఏళ్లకు పైబడిన, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేయడం చట్టబద్ధంగా చెల్లదని స్పష్టం చేసింది. వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కువైత్ సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

Updated Date - 2021-11-03T17:15:59+05:30 IST