ప్రవాసులకు Kuwait బిగ్ షాక్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే..!

ABN , First Publish Date - 2021-12-16T15:10:50+05:30 IST

వలసదారులకు గల్ఫ్ దేశం కువైత్ భారీ షాక్ ఇచ్చింది. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ట్రాన్సక్షన్స్‌ అన్నింటినీ నిలిపివేసింది.

ప్రవాసులకు Kuwait బిగ్ షాక్.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కష్టమే..!

కువైత్ సిటీ: వలసదారులకు గల్ఫ్ దేశం కువైత్ భారీ షాక్ ఇచ్చింది. ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ట్రాన్సక్షన్స్‌ అన్నింటినీ నిలిపివేసింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ అండర్‌సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ ఫైజల్ అల్ నవాఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రస్తుతం కువైత్‌లో సుమారు 7లక్షల మంది వలసదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. తాజాగా అంత అంతర్గత మంత్రిత్వ శాఖ పాత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లను కొత్త మాగ్నెటిక్ వాటితో భర్తీ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 


ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన ట్రాన్సక్షన్స్‌ అన్నింటినీ నిలిపివేసిందని సమాచారం. ఇక ఈ కొత్త ప్రక్రియలో భాగంగా పలు కారణాలతో సుమారు 2.50 లక్షల మంది వలసదారుల చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు కానున్నాయి. తప్పుడు సమాచారంతో లైసెన్స్ పొందడం, వృత్తి మార్పు, కువైత్‌ను శాశ్వతంగా విడిచిపెట్టడం వంటి తదితర కారణాలను ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జారీ చేయబడిన మొత్తం డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య 3 మిలియన్లకు పైగా ఉన్నట్లు అంచనా.  


ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు షరతులివే..

2014 నవంబర్ 25న జారీ చేసిన మంత్రివర్గ తీర్మానం నం. 5598/2014 ప్రకారం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసులు డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. అయితే, దీనికి కొన్ని షరతులు ఉన్నాయి.

1. కువైట్‌లో 2 సంవత్సరాల నివాసం

2. నెలవారీ జీతం 600 కువైటీ దినార్లు(రూ.1.50లక్షలు) ఉండాలి

3. యూనివర్సిటీ డిగ్రీ కలిగి ఉండాలి


డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఏ ప్రవాసులు దరఖాస్తు చేసుకోవచ్చు

1. కువైత్ భార్యలు / వితంతువులు / విడాకులు తీసుకున్న పిల్లలు

2. కువైత్ మహిళ భర్త, వారి పిల్లలు

3. కువైత్‌లోని యూనివర్సిటీ లేదా అప్లైడ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న విద్యార్థులు

4. దౌత్య సంస్థల సభ్యులు

5. ప్రభుత్వ సంస్థలలో స్పోర్ట్స్ క్లబ్‌లు, సమాఖ్యల వృత్తిపరమైన ఆటగాళ్లు

6. ఎంబసీ డ్రైవర్లు, ప్రతినిధులు

7. స్పాన్సర్‌ల కోసం పనిచేసే సర్వెంట్స్ (5 సంవత్సరాలకు తగ్గకుండా వారి వృత్తి డ్రైవర్‌గా ఉంటే)

8. చమురు కంపెనీలలోని చమురు క్షేత్రాలలో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు

9. పైలట్లు, కెప్టెన్లు, వారి సహాయకులు

10. నర్సులు, ఫిజియోథెరపిస్ట్‌లు, వైద్య వృత్తుల సాంకేతిక నిపుణులు

11. డెడ్ బాడీ వాషర్స్


జీతం, నివాస షరతుల నుండి 7 వర్గాలకు మినహాయింపు

1. న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ సభ్యులు, సలహాదారులు

2. యూనివర్సిటీలు, అప్లైడ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీ సభ్యులు

3. జర్నలిస్టులు, మీడియా నిపుణులు

4. వైద్యులు, ఫార్మసిస్ట్‌లు

5. ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న వారి పేర్లన్నీ, న్యాయనిపుణులు, అనువాదకులు, లైబ్రేరియన్లు, మసీదుల ఇమామ్‌ల పరిశోధకులు

6. ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ఇంజనీర్లు

7. ప్రభుత్వ సంస్థలలోని క్రీడా సమాఖ్యలు, క్లబ్‌లలో పనిచేస్తున్న క్రీడా కోచ్‌లు

Updated Date - 2021-12-16T15:10:50+05:30 IST