Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అన్ని రకాల Visit Visa ల జారీని నిలిపివేసిన Kuwait.. కారణం ఏంటంటే

twitter-iconwatsapp-iconfb-icon
అన్ని రకాల Visit Visa ల జారీని నిలిపివేసిన Kuwait.. కారణం ఏంటంటే

కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ అన్ని రకాల విజిట్ వీసాలను (Visit visa) నిలిపివేసిన విషయం తెలిసిందే. తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాల జారీ ఉండదని ప్రకటించింది. దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ అహ్మద్ అల్ నవాఫ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సోమవారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వచ్చిందని తెలిపారు. రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాల జారీ కోసం కొత్తగా తీసుకొచ్చిన మెకానిజంను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ విరామం ఇచ్చినట్లు చెప్పారు. అయితే, తాజా సమాచారం ప్రకారం విజిట్ వీసాల జారీ నిలివేతకు ప్రధాన కారణం విజిట్ వీసాలపై వచ్చిన చాలా మంది విదేశీయులు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. విజిట్ వీసాలపై కువైత్ వచ్చిన సుమారు 20వేల మంది తిరిగి వారి దేశాలకు వెళ్లలేదని సమాచారం. ఇక 2022లో ఇప్పటివరకు టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలపై ఆ దేశానికి వెళ్లిన వారి సంఖ్య 70వేలకు చేరినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. 


ఇక మహమ్మారి కరోనా నేపథ్యంలో ఒకటిన్నరేళ్లు కువైత్ విదేశీయులకు ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కువైత్ ఈ వీసాల జారీని ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరుద్ధరించింది. ఇక ఇప్పటికే ఆ దేశ కేబినేట్ ప్రవాసులకు అన్ని రకాల వీసాల జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతొ వర్క్ వీసాలతో పాటు కమర్షియల్ విజిట్ వీసా, ఫ్యామిలీ వీసాలను సంబంధిత అధికారులు జారీ చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఫ్యామిలీ విజిట్, టూరిస్ట్ వీసాలను మరోసారి నిలిపివేసింది. దీనికి కారణం ఈ వీసాలపై వచ్చిన వారు ఉల్లంఘనలకు పాల్పడమేనని పేర్కొంది.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.