కువైత్ వెళ్లాల్సిన భారతీయ ప్రయాణికుల వీక్లీ కోటా ఎంతంటే..

ABN , First Publish Date - 2021-08-31T14:57:42+05:30 IST

కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత గల్ఫ్ దేశం కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే.

కువైత్ వెళ్లాల్సిన భారతీయ ప్రయాణికుల వీక్లీ కోటా ఎంతంటే..

కువైత్ సిటీ: కరోనా ఆంక్షలు తొలగించిన తర్వాత గల్ఫ్ దేశం కువైత్ ఇటీవల ఎయిర్‌పోర్టుకు డైలీ రావాల్సిన ప్రయాణికుల సామర్థ్యాన్ని 10వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత్ నుంచి కువైత్‌కు వచ్చే ప్రయాణికుల కోటాను తాజాగా ప్రకటించింది. వీక్లీ కువైత్‌కు కేవలం 760 మంది భారతీయ ప్రయాణికులు మాత్రమే రావాలని పేర్కొంది. అలాగే ఈ కోటాలో కువైత్ క్యారియర్లు, భారతీయ విమాన సర్వీసులకు చెరో 380 సీట్లు కేటాయించింది. అంతేగాక కువైత్ క్యారియర్లకు కూడా 380 సీట్లను విభజించింది. వీటిలో కువైత్ ఎయిర్ వేస్‌కు 230 సీట్లు, జజీర ఎయిర్ వేస్‌కు 150 సీట్లు కేటాయించింది. కాగా, సంబంధిత అధికారులు త్వరలో ఇరు దేశాల మధ్య ప్రారంభంకానున్న డైరెక్ట్ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.  

Updated Date - 2021-08-31T14:57:42+05:30 IST