Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్యామిలీ, విజిట్ వీసాలపై Kuwait కొత్త షరతులు..!

కువైత్ సిటీ: కువైత్‌లో ఎంట్రీ కోసం ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. అది కూడా కేవలం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే వీసాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే వీసాల జారీలో మంత్రిత్వశాఖ కొన్ని షరతులు విధించింది. మరికొన్ని వీసాల జారీ ప్రక్రియకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. నాన్ రెసిడెంట్లకు టూరిస్ట్ వీసాలు ప్రస్తుతం జారీ చేయడం లేదని ప్రకటించింది. ఇక ఫ్యామిలీ వీసాల విషయానికి వస్తే.. భార్య, 16 ఏళ్లలోపు చిన్నారులకు మాత్రమే వీసాలు జారీ చేయనున్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ వీసా కోసం శాలరీ కండిషన్ కూడా పెట్టింది. 

వర్క్‌ పర్మిట్‌లో 500 కువైటీ దినార్లు(రూ.1.23లక్షలు) ఉన్నవారికి మాత్రమే ఫ్యామిలీ వీసా మంజూరు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(క్యూఆర్ కోడ్‌తో ఉన్నది) సమర్పించడం తప్పనిసరి. ఇకపోతే కమర్షియల్ విజిట్ వీసాలు, గవర్నమెంట్ విజిట్ మరియు ఈ-వీసాలు(ప్రస్తుతం 53 దేశాల వారికి) జారీ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ ఎంట్రీ వీసాలు, వర్క్ పర్మిట్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది.  

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement