Kuwait సంచలన నిర్ణయం.. వారికి ఎలాంటి కరోనా ఆంక్షలు లేవు..

ABN , First Publish Date - 2021-10-21T18:51:28+05:30 IST

దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో సాధారణ జీవనంవైపు అడుగులేస్తున్న కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

Kuwait సంచలన నిర్ణయం.. వారికి ఎలాంటి కరోనా ఆంక్షలు లేవు..

కువైత్ సిటీ: దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో సాధారణ జీవనంవైపు అడుగులేస్తున్న కువైత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి ఎలాంటి కరోనా ఆంక్షలు లేవని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఆ దేశ ప్రధానమంత్రి షేక్ సభా ఖలేద్ అల్ హమద్ అల్ సభా మీడియా సమావేశంతో చెప్పారు. పెళ్లిలు, సమావేశాలు, సామాజిక కార్యాక్రమాలు ఇతర వాటికి పరిమిత సంఖ్యలో హాజరు కావాలనే నిబంధనను కూడా తొలగించారు. కాకపోతే టీకాలు తీసుకున్నవారు మాత్రం ఇలా అపరిమిత సంఖ్యలో వివిధ కార్యక్రమాలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. 


ఇక బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రం తప్పనిసరి అని తెలిపారు. అటు ఆదివారం(అక్టోబర్ 24) నుంచి కువైత్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం(అక్టోబర్ 24) నుంచి పూర్తి సామర్థ్యంతో పని చేస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు రోజువారీ ప్రయాణికుల సామర్థ్యం 10వేలుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ప్రస్తుతం వీక్లీ కువైత్‌కు 5,528 మంది భారతీయ ప్రయాణికులు వెళ్లేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఆదివారం నుంచి ఈ ఆంక్షలు తొలగిపోనున్నాయి.

Updated Date - 2021-10-21T18:51:28+05:30 IST