Work Visa: కువైత్ కొత్త సర్వీస్.. ప్రైవేట్ సెక్టార్ కార్మికులకు ప్రయోజనం

ABN , First Publish Date - 2022-04-26T13:58:24+05:30 IST

కువైత్ వర్క్ వీసాల జారీ కోసం తాజాగా కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది.

Work Visa: కువైత్ కొత్త సర్వీస్.. ప్రైవేట్ సెక్టార్ కార్మికులకు ప్రయోజనం

కువైత్ సిటీ: కువైత్ వర్క్ వీసాల జారీ కోసం తాజాగా కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ఇకపై ప్రైవేట్ సెక్టార్ కార్మికులకు ఆన్‌లైన్ ద్వారా వర్క్ వీసాలు జారీ చేయనుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్, అంతర్గత మంత్రిత్వశాఖలు కలిసి పని చేయనున్నాయి. ఈ-వీసాల జారీ పనులను ఈ రెండు శాఖలు చూసుకోనున్నాయి. దీనికోసం ఆటోమేటెడ్ సీస్టంను వినియోగించనున్నాయి. ఈ-గవర్నమెంట్ దిశగా ఈ కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీకి సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్‌మెంట్ ప్రతినిధి అసెల్ అల్ మజీద్ తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా వీసా జారీ ప్రక్రియ చాలా త్వరగా జరుగుతుందన్నారు. అలాగే ఏదైనా సమస్య ఉండి వీసాలు రద్దు చేయాలంటే కూడా చాలా సులువు అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఇంతకుముందులా వీసాల జారీకి గానీ, రద్దుకు గానీ ఎక్కువ సమయం వృధా కాదని అల్ మజీద్ చెప్పుకొచ్చారు.   

Updated Date - 2022-04-26T13:58:24+05:30 IST