గృహ కార్మికుల నియామకాలపై కువైత్ కీలక ప్రకటన.. భారతీయ పని మనుషుల రిక్రూట్‌మెంట్ కాస్ట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-08-09T14:05:04+05:30 IST

కువైత్ విదేశీ పని మనుషుల నియామకాలకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది. గృహ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి గరిష్ట వ్యవయాన్ని దేశాల వారీగా నిర్ణయించింది.

గృహ కార్మికుల నియామకాలపై కువైత్ కీలక ప్రకటన.. భారతీయ పని మనుషుల రిక్రూట్‌మెంట్ కాస్ట్ ఎంతంటే..

కువైత్ సిటీ: కువైత్ విదేశీ పని మనుషుల నియామకాలకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది. గృహ కార్మికులను రిక్రూట్ చేసుకోవడానికి గరిష్ట వ్యవయాన్ని దేశాల వారీగా నిర్ణయించింది. ఇందులో విమాన టికెట్ల ఖర్చులను మాత్రం చేర్చలేదు. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమలు, సామాజిక వ్యవహారాలు మరియు అభివృద్ధి మంత్రి ఫహద్ అల్ ష్రాన్ తాజాగా ప్రకటన విడుదల చేశారు. మంత్రి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫిలిప్పీన్స్ కార్మికుల నియామకానికి అత్యధికంగా 850 కువైటీ దినార్లు(రూ.2.20లక్షలు)గా నిర్ణయించడం జరిగింది. ఇక భారతీయ కార్మికుల విషయానికి వస్తే.. మనోళ్లను రిక్రూట్ చేసుకునేందుకు 700 కేడీలు(రూ.1.80లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మన పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా ఇదే ధరను నిర్ణయించింది. ఇక ఆఫ్రికన్ పని మనుషుల రిక్రూట్‌మెంట్ వ్యయం 500 కువైటీ దినార్లు(రూ. 1.22లక్షలు)గా పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. 

Updated Date - 2022-08-09T14:05:04+05:30 IST