రెండు నెలల్లో.. 20వేల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్ !

ABN , First Publish Date - 2021-03-12T14:43:04+05:30 IST

గడిచిన రెండు నెలల్లో ఏకంగా 20వేల వరకు వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసినట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) తాజాగా వెల్లడించింది.

రెండు నెలల్లో.. 20వేల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసిన కువైట్ !

కువైట్ సిటీ: గడిచిన రెండు నెలల్లో ఏకంగా 20వేల వరకు వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసినట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 12 నుంచి మార్చి 7 మధ్య సుమారు 19,995 వర్క్ పర్మిట్స్ రద్దు అయినట్లు పీఏఎం పేర్కొంది. వీటిలో అత్యధికంగా ప్రవాసులు కువైట్ బయట చిక్కుకుపోవడం వల్ల క్యాన్సిల్ అయినట్లు తెలిపింది. కరోనా వల్ల ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో 12,391 మంది ప్రవాసుల వర్క్ పర్మిట్స్ రద్దు అయ్యాయి. అలాగే 6,245 మంది ప్రవాసులు శాశ్వతంగా కువైట్‌ను వదిలివెళ్లడం వల్ల వారి వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసింది.


మరో 83 మంది వర్క్ పర్మిట్లను ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లకు మార్చడం జరిగింది. మరికొన్ని వర్క్ పర్మిట్స్ ప్రవాసులు వారి వీసాలను డిపెండెంట్ వీసాలకు బదిలీ చేసుకోవడంతో రద్దయ్యాయి. ఇలా రెండు నెలల కాల వ్యవధిలో దాదాపు 20వేల మంది ప్రవాసుల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ అయినట్లు పీఏఎం వెల్లడించింది. ఇక జనవరిలో ప్రతి గంటకు సుమారు 12 మంది ప్రవాసులు కువైట్‌ను విడిచి వెళ్లినట్లు పీఏఎం తన నివేదికలో పేర్కొంది.   

Updated Date - 2021-03-12T14:43:04+05:30 IST