కువైట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్ర‌వాసుల‌కు షాక్‌ !

ABN , First Publish Date - 2020-07-05T19:25:56+05:30 IST

కువైట్ ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌వాసుల‌కు షాకిస్తూ కువైట్ కేబినెట్ విదేశీయుల కోటాను కుదించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఐదుగురు ఎంపీల బృందం ప్ర‌వేశ‌పెట్టిన ముసాయిదా బిల్లుకు జాతీయ అసెంబ్లీ‌, లెజిస్టేటివ్ క‌మిటీ కూడా ఆమోదం తెలిపాయి.

కువైట్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్ర‌వాసుల‌కు షాక్‌ !

కువైట్ సిటీ: కువైట్ ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌వాసుల‌కు షాకిస్తూ కువైట్ కేబినెట్ విదేశీయుల కోటాను కుదించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఐదుగురు ఎంపీల బృందం ప్ర‌వేశ‌పెట్టిన ముసాయిదా బిల్లుకు జాతీయ అసెంబ్లీ‌, లెజిస్లేటివ్‌ క‌మిటీ కూడా ఆమోదం తెలిపాయి. ఈ ముసాయిదా బిల్లును అమ‌లు ప‌ర‌చ‌డ‌మే త‌రువాయిగా మిగిలింది. ఇక బిల్లు అమ‌లులోకి వ‌స్తే కువైట్‌లో అధికంగా ఉన్న భార‌త ప్ర‌వాసుల‌తో పాటు ఇత‌ర దేశాల వ‌ల‌స‌దారుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డ‌నుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బిల్లు ప్ర‌కారం కువైట్ మొత్తం జ‌నాభాలో భార‌త ప్ర‌వాసులు 15 శాతానికి మించి ఉండ‌కూడ‌దు. అలాగే ఫిలిప్పీన్స్‌, ఈజిప్ట్‌, శ్రీలంక ప్ర‌వాసులు 10 శాతం... పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, వియ‌త్నం, నేపాల్‌కు చెందిన‌ ప్ర‌వాసీయులు 3 శాతం మాత్ర‌మే ఉండేందుకు అనుమ‌తి ఉంటుంది. దీంతో ఆయా దేశాల నుంచి కువైట్ వ‌ల‌స వెళ్లిన ప్ర‌వాసులు వారి ప‌రిమితికి మించి ఉంటే తిరిగి స్వ‌దేశానికి రావాల్సి ఉంటుంది. కాగా, 2018 కువైట్ జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం అక్క‌డ 10 ల‌క్ష‌ల మంది భార‌త ప్ర‌వాసులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఇక ముసాయిదా బిల్లు అమ‌లులోకి వ‌స్తే ఈ సంఖ్య 6 ల‌క్ష‌ల‌కు త‌గ్గ‌నుంది.  

Updated Date - 2020-07-05T19:25:56+05:30 IST