కువైత్‌లో 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల Work Permit రెన్యువల్ ఫీజు ఫిక్స్.. వారికి మాత్రం మినహాయింపు!

ABN , First Publish Date - 2022-01-25T13:27:48+05:30 IST

60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయమై గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడి ధోరణిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టకేలకు ఆ సందిగ్ధానికి తెర పడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును...

కువైత్‌లో 60 ఏళ్లకు పైబడిన ప్రవాసుల Work Permit రెన్యువల్ ఫీజు ఫిక్స్.. వారికి మాత్రం మినహాయింపు!

కువైత్ సిటీ: 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు సంబంధించిన వర్క్ పర్మిట్ల రెన్యువల్ విషయమై గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ ఏ నిర్ణయం తీసుకోకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టకేలకు ఆ సందిగ్ధానికి తెర పడింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్(పీఏఎం) ఈ కేటగిరీ ప్రవాసుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ ఫీజును ఇంతకుముందు చెప్పినట్లే 250 కువైటీ దినార్లుగా(సుమారు రూ.61వేలు) నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా జరిగిన పీఏఎం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులకు భారీ ఉమశమనం లభించింది. 


కాగా, ఈ ఫీజు నుంచి కొన్ని కేటగిరీల వారికి  పీఏఎం మినహాయింపు ఇచ్చింది. వీరిలో ప్రవాసులను పెళ్లాడిన కువైత్ మహిళలకు పుట్టిన పిల్లలకు, కువైత్‌లో పుట్టిన వారికి, పాలస్తీనా పౌరులకు వర్క్ పర్మిట్ల రెన్యువల్ రుసుము ఉండదు. ఇదిలాఉంటే.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు విషయమై పీఏఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లను బట్టి ఈ రుసుము నిర్ణయించనున్నారు. కాగా, ఇటీవల ఈ కేటగిరీ ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ ఫీజు విషయమై పలు ప్రతిపాదనలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిపి ఏడాదికి వెయ్యి కువైటీ దినార్లు(రూ.2.46లక్షలు) ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదన ప్రముఖంగా వినిపించింది. ఇక తాజా నిర్ణయంతో కువైత్‌లో అధికంగా ఉండే భారత ప్రవాసులకు సైతం భారీ ఉపశమనం లభించింది. పీఏఎం నిర్ణయం పట్ల అక్కడి ప్రవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-01-25T13:27:48+05:30 IST