Family visit visa: కువైత్ కీలక ప్రకటన.. వలసదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

ABN , First Publish Date - 2022-05-31T14:44:19+05:30 IST

ఫ్యామిలీ విజిట్ వీసా విషయమై తాజాగా కువైత్ కీలక ప్రకటన చేసింది. Family visit visa గరిష్ట వ్యవధి మూడు నెలలు మాత్రమేనని తెలిపింది. అంతేగాక దీనికి రెన్యువల్ అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఏడాది పాటు వీసా గడువు పొడిగింపు అనేది కేవలం కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అదికూడా కమర్షియల్ విజిట్ వీసాపై కార్మికులను తీసుకొచ్చే..

Family visit visa: కువైత్ కీలక ప్రకటన.. వలసదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

కువైత్ సిటీ: ఫ్యామిలీ విజిట్ వీసా విషయమై తాజాగా కువైత్ కీలక ప్రకటన చేసింది. Family visit visa గరిష్ట వ్యవధి మూడు నెలలు మాత్రమేనని తెలిపింది. అంతేగాక దీనికి రెన్యువల్ అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఏడాది పాటు వీసా గడువు పొడిగింపు అనేది కేవలం కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. అదికూడా కమర్షియల్ విజిట్ వీసాపై కార్మికులను తీసుకొచ్చే కంపెనీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని వెల్లడించింది. ప్రవాసులకు సంబంధించిన Residency సవరణ కోసం చట్టంలో మార్పులు చేస్తున్నారు. ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్ట సవరణలు ఉండనున్నాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఉల్లంఘనదారులకు ఐదేళ్ల వరకు జైలు, గరిష్టంగా 10వేల కువైటీ దినార్ల(రూ.25.37లక్షలు) జరిమానా ఉంటుంది. 


ఇక డొమెస్టిక్ వర్కర్స్ కూడా దేశం వెలుపల 4 నెలలకు మించి ఉండకూడదు. గృహ కార్మికులు నాలుగు నెలల వ్యవధి ముగిసేలోపు అంతర్గత మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందితే తప్ప నాలుగు నెలల కంటే ఎక్కువ కాలం పాటు కువైత్ వెలుపల ఉండడానికి అనుమతించబడరు. ఇదిలాఉంటే.. కువైత్ పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ ఈ నెల 26న(గురువారం) విదేశీ రెసిడెన్సీ చట్ట సవరణలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సవరణలతో ఆ దేశంలో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల వరకు రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. 


అలాగే రియల్ ఎస్టేట్ యజమానులు, ప్రవాసులను పెళ్లాడిన కువైటీ మహిళల పిల్లలకు 10 ఏళ్ల ఇకామా(రెసిడెన్సీ పర్మిట్)కు కూడా మార్గం సుగమమవుతుంది. ఈ బిల్లును కమిటీ ఆమోదం కోసం నేషనల్ అసెంబ్లీకి పంపనుంది. అసెంబ్లీ ఆమోదం లభించగానే ప్రభుత్వం సంతకంతో వెంటనే ఇది అమలులోకి వస్తుంది. ఇక సాధారణంగా ఆ దేశంలో ప్రవాసులకు ఐదేళ్ల కాలపరిమితికి మాత్రమే నివాసానికి అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఇకామా గడువు ముగిసిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రెసిడెన్సీ రెన్యువల్‌కు కూడా అవకాశం ఉండదు. 

Updated Date - 2022-05-31T14:44:19+05:30 IST