Kuwait: ప్రయాణికుల కోసం కస్టమ్స్ డిక్లరేషన్ ఈ-ఫారం

ABN , First Publish Date - 2022-07-06T16:12:35+05:30 IST

ఎలక్ట్రానిక్ కస్టమ్స్ డిక్లరేషన్ ఫారం ప్రయాణికులకు విధానాలను మరింత సులభతరం చేయడానికి ఒక మార్గమని కువైత్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (KGAC) డైరెక్టర్ జనరల్ సులేమాన్ అల్-ఫహద్ తెలిపారు.

Kuwait: ప్రయాణికుల కోసం కస్టమ్స్ డిక్లరేషన్ ఈ-ఫారం

కువైత్ సిటీ: ఎలక్ట్రానిక్ కస్టమ్స్ డిక్లరేషన్ ఫారం ప్రయాణికులకు విధానాలను మరింత సులభతరం చేయడానికి ఒక మార్గమని కువైత్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (KGAC) డైరెక్టర్ జనరల్ సులేమాన్ అల్-ఫహద్ తెలిపారు. మనీలాండరింగ్, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడంపై 2013 చట్టం నం.106 ప్రకారం ఇది ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సమయాన్ని తగ్గించి భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. తప్పుడు వివరాలు అందించిన ప్రయాణికులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కస్టమ్స్ అధికారులు చర్యలు చేపడతారని ఆయన హెచ్చరించారు. ఫారం రాకముందే ఎలక్ట్రానిక్‌గా పూర్తి చేయబడుతుంది. దీంతో ఇది సమయాన్ని తగ్గించి, భద్రతను పటిష్టం చేస్తుందన్నారు. ఇక తమ వివరాలను తప్పుగా ప్రకటించడం వలన సంబంధిత ప్రయాణీకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కస్టమ్స్ అధికారులను అలెర్ట్ చేస్తుందని తెలిపారు. వివిధ పోర్టల్స్ ద్వారా దేశంలోకి ప్రవేశించే లేదా బయల్దేరే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా 3వేల కువైటీ దినార్లు(రూ.7.74లక్షలు) కంటే ఎక్కువ లేదా ఏదైనా విదేశీ కరెన్సీలో సమానమైన తమ వద్ద ఉన్న మొత్తాన్ని కస్టమ్స్ అధికారులకు వెల్లడించాలని సులేమాన్ అల్-ఫహాద్ సూచించారు. 

Updated Date - 2022-07-06T16:12:35+05:30 IST