Abn logo
Sep 17 2020 @ 11:56AM

క‌రోనా ఫ్రంట్‌లైన‌‌ర్స్‌పై కువైట్ వ‌రాల జ‌ల్లు !

కువైట్ సిటీ: క‌రోనా క‌ష్ట‌కాలంలో త‌మ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌పై కువైట్ ప్ర‌భుత్వం వ‌రాల జల్లు కురిపించింది. బోన‌స్‌గా రెండు నెల‌ల జీతం, మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కువైట్‌లోని అన్ని సెక్యూరిటీ విభాగాల ఉద్యోగుల‌కు దీనిని వ‌ర్తింప చేస్తామ‌ని తెలియ‌జేసింది. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం చేప‌ట్టిన క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌ను అమ‌లు చేయ‌డంలో ఫ్రంట్‌లైన‌ర్స్ పాత్ర  వెల‌క‌ట్ట‌లేనిద‌ని అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ఉన్న‌తాధికారి ఒక‌రు తెలిపారు. వారి సేవ‌ల‌కు గుర్తింపుగా ఈ ప్రోత్స‌హ‌కాలు అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. దీని ద్వారా కువైట్ ఆర్మీ, పోలీస్‌, నేష‌న‌ల్ గార్డ్‌, ఫైర్ అండ్ సెఫ్టీ  విభాగాల ఉద్యోగులు ల‌బ్ధి పొంద‌నున్నారు. 

Advertisement
Advertisement
Advertisement