ఎన్నారైలకు కువైట్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్...

ABN , First Publish Date - 2020-02-19T15:35:44+05:30 IST

ఎన్నారైలకు కువైట్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

ఎన్నారైలకు కువైట్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్...

తిరువనంతపురం: ఎన్నారైలకు కువైట్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 'నార్కా(నాన్ రెసిడెంట్ కేరలైట్స్ అఫైర్స్) ఫెయిర్' బెనిఫిట్స్‌ను ఎన్నారైలకు కూడా వర్తింపజేస్తూ తమ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించేవారికి విమాన చార్జీలపై 7 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 20 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. నార్కా ఐడీలు గల ఎన్నారైలతో పాటు వారి భాగస్వాములు, పిల్లల(18లోపు వయసు గల)కు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.


కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమక్షంలో ఈ ఒప్పందంపై నార్కా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే.  హరిక్రిష్ణన్ నంబూర్తి, కువైట్ ఎయిర్‌వేస్ సెల్స్ మేనేజర్ సుధీర్ మెహతా సంతకాలు చేశారు. సీఎంఓలో జరిగిన ఈ కార్యక్రమానికి నార్కా ప్రిన్సిపల్ సెక్రటరీ కే. ఇలాంకోవన్, జాయింట్ సెక్రటరీ కే. జనార్ధన్, నార్కా రూట్స్ జనరల్ మేనేజర్ డి. జగదీష్ హాజరయ్యారు. 


టికెట్స్ బుకింగ్ ఇలా...

ఎన్నారైలు కువైట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఇండియాలోని దాని కార్యాలయాలలో గానీ ఈ ఆఫర్ కింద టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం నార్కా రూట్స్ టోల్ ఫ్రీ నెం. 1800 4283939(ఇండియా), 00918802012345(విదేశాలలో ఉన్నవారికి) సంప్రదించవచ్చు. 

Updated Date - 2020-02-19T15:35:44+05:30 IST