కాలువలో చిక్కుకున్న యువకుడు

ABN , First Publish Date - 2021-12-04T16:13:00+05:30 IST

చెన్నైలో వర్షం నిలిచిపోయినా కాలువల్లో వరద ఉదృతి మాత్రం తగ్గడం లేదు. కోయంబేడు బాడీ కుప్పం ప్రాంతంలోని కల్వర్టు పైనుంచి వారం రోజులుగా వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకల

కాలువలో చిక్కుకున్న యువకుడు

             - కాపాడిన అగ్నిమాపక సిబ్బంది


చెన్నై: చెన్నైలో వర్షం నిలిచిపోయినా కాలువల్లో వరద ఉదృతి మాత్రం తగ్గడం లేదు. కోయంబేడు బాడీ కుప్పం ప్రాంతంలోని కల్వర్టు పైనుంచి వారం రోజులుగా వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో, కొళత్తూర్‌కు చెందిన పుగళ్‌ అనే యువకుడు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆ కల్వర్టు మీదుగా కోయంబేడు వైపునకు నడచి వెళుతూ కూవం కాలువలో జారిపడ్డాడు. చుట్టూ చీకటిగా ఉండడంతో కాలువలో నుంచి బయటకు వచ్చేందుకు అతని ప్రయత్నాలు ఫలించక రాత్రంతా చలిలో కాలువలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం అటువైపు వెళుతున్న వారిని చూసిన పుగళ్‌ తనను కాపాడాలని  కోరాడు. దీనిపై అందజేసిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కూవం కాలువలో దిగి పుగళ్‌ను కాపాడారు.

Updated Date - 2021-12-04T16:13:00+05:30 IST