Kutralamలో పర్యాటకుల సందడి

ABN , First Publish Date - 2022-07-10T15:39:41+05:30 IST

కుట్రాలం జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. తెన్‌కాశి జిల్లా కుట్రాలం, పరిసర ప్రాంతాల్లో కురస్తున్న వర్షాల కారణంగా ప్రధాన జలపాతం, ఐందురువి,

Kutralamలో పర్యాటకుల సందడి

పెరంబూర్‌(చెన్నై), జూలై 9: కుట్రాలం జలపాతం పర్యాటకులతో కిటకిటలాడింది. తెన్‌కాశి జిల్లా కుట్రాలం, పరిసర ప్రాంతాల్లో కురస్తున్న వర్షాల కారణంగా ప్రధాన జలపాతం, ఐందురువి, పాత కుట్రాలం, పులియరువి, సిట్రరవి తదితర జలపాతాలు జాలువారే నీటితో కళకళలాడుతున్నాయి. జలపాతాల వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో రెండు రోజుల క్రితం పర్యాటకుల స్నానాలకు అధికారులు నిషేధం విధించారు. ప్రస్తుతం జలపాతాల వద్ద నీటి ఉధృతి తగ్గడంతో శనివారం నుంచి స్నానాలకు అనుమతించారు. దీంతో పెద్ద సంఖ్యలో జలపాతాల వద్దకు చేరుకున్న పర్యాటకులు, భారీ క్యూలైన్లలో వేచి ఉండి జలపాతాల వద్ద స్నానం చేసి ఉత్సాహంగా గడిపారు.

Updated Date - 2022-07-10T15:39:41+05:30 IST