Telugudesam కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

ABN , First Publish Date - 2021-10-19T06:43:53+05:30 IST

Telugudesam కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

Telugudesam కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..

  • కుతూహలమ్మ రాజీనామా

చిత్తూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ టీడీపీకి రాజీనామా చేశారు. అనారోగ్య సమస్యలతో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని ఆమెతో పాటు ఆమె కుమారుడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గ నేత హరికృష్ణ కూడా రాజీనామాలను టీడీపీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రబాబు, లోకేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం పంపించారు. అదే రోజు సాయంత్రం ఇద్దరి రాజీనామాను చంద్రబాబు ఆమోదించారు.


కాంగ్రెస్‌లో అప్పటి మంత్రి చంద్రబాబు మద్దతుతో 1981లో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్‌ కుతూహలమ్మ అనంతరం అదే పార్టీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా,అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు.రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరిన కుతూహలమ్మ 2014 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.తరువాత అనారోగ్యం కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వున్న ఆమె 2019 ఎన్నికల్లో తన కుమారుడు ఆనగంటి హరికృష్ణకు టీడీపీ టికెట్టు ఇప్పించుకున్నారు.


వైసీపీ అభ్యర్థి నారాయణస్వామిపై పోటీ చేసి ఓడిపోయిన హరికృష్ణ కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు.దీంతో టీడీపీ అధిష్ఠానం ఇటీవల గంగాధర నెల్లూరునియోజకవర్గ బాధ్యతలను పాలసముద్రం మాజీ జడ్పీటీసీ చిట్టిబాబు నాయుడికి ఇటీవల అప్పగించింది. చిట్టిబాబు ఇటీవల కుతూహలమ్మను కలిసి సహకారం కోరిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కుతూహలమ్మ,హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2021-10-19T06:43:53+05:30 IST